పుట:Thimmarusumantri.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

తిమ్మరుసు మంత్రి


నకు రప్పించుకొనియెను. రామరాయ లేమిబోధించెనో కాని సంవత్సరకాలము గడచిన తరువాత ప్రధానామాత్యుఁడు వీరనరసింగరాయలు చేసినకార్యములన్నిటిని తారుమాఱుచేసి వానిని తుదకు ప్రధానామాత్యపదవినుండి తప్పించి యథాస్థానమునకు బంపించెను. తరువాత నచ్యుతదేవరాయల కతఁడొక గొప్ప శత్రువై చాల బాధలు కలుగఁజేసెను. దక్షిణదేశమున గొప్ప తిరుగుబాటు సంఘటింపజేసెను.

ఈపై విషయములన్నియుఁ గృష్ణదేవరాయలమృతికిఁ బూర్వమునందును బరమందును జరిగినవిగా నున్నవి. కృష్ణదేవరాయలు తన యవివేకమువలనఁ దన యవసానకాలమంతయు దుఃఖప్రదముగాఁ జేసికొని స్వర్గస్థుఁడై పోయెను. 1526 వ సం|| రము మొదలుకొని తిమ్మరుసుయొక్కఁగాని వాని సంతతివారియొక్కగాని వారిబంధువులయొక్కగాని చరిత్రముగాని విజయనగరసామ్రాజ్యచరిత్రమున వినంబడదు. ఈకడపటి వృత్తాంతము నొక్క సన్నీజు మాత్రమే పేర్కొని యుండెనుగాని మఱియే చరిత్రకారుఁడును విజాతీయులలోఁగాని స్వజాతీయులలోఁగాని పేర్కొన్నవారు గానంబడరు. ఇందలి నిజమేమో లోక మెఱుంగదు. ... రియదృష్ట మట్లున్నది.


సంపూర్ణము.

___________