పుట:Thimmarusumantri.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

157


ఈయుద్ద మెప్పుడు జరిగినను అచ్యుతదేవరాయలు విజయనగరము ప్రవేశింపక మునుపే జరిగియుండును. కనుక కృష్ణదేవరాయలు 1526 లోనే మృతిఁనొందె ననుట విశ్వాసపాత్రమయిన విషయము. సాళువ వీరనరసింగరాయమంత్రిపుంగవుని సహాయ్యముతో అచ్యుతదేవరాయల బావమరదులు సలకము పెదతిమ్మరాజు, సలకము చిన్నతిమ్మరాజు విజయనగరముపై దండెత్తి వచ్చినపుడు రామరాయలును, వాని సోదరులును విజయనగరమును విడిచి పోయి యాదవాని దుర్గమును జేరవలసినవారైరి.

ఇట్లు అళియరామరాయల సోదరులు విజయనగరమును విడిచి పలాయనులయిన వెనుక సలకము సోదరులును, వీరనరసింగరాయలును చంద్రగిరి దుర్గమునుండి అచ్యుతదేవరాయలను రప్పించి వానిని విజయనగరమునఁ బట్టాభిషిక్తునిగావించి అనేక హరిదానములను బ్రాహ్మణులకును, దేవాలయములకును జేసి యుండిరి. ఆవెంటనే అచ్యుతదేవరాయలు తనకింత మహోపకారమును గావించిన వీరనరసింగరాయలను బ్రాహ్మణమంత్రికిఁ ప్రధానామాత్యపదవి నొసంగెను. ఇట్లొక సంవత్సరము జరిగిన వెనుక అచ్యుతదేవరాయలు బలాఢ్యుడయిన అళియరామరాయలతో విరోధముగా నుండుట యపాయకరమని యెంచి తనతోగూడ అళియరామరాయలు పరిపాలనము చేయుటకు సమ్మతించి వానితో రాజీ చేసికొని వానిని విజయనగరము