పుట:Thimmarusumantri.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

తిమ్మరుసు మంత్రి

    సెలగోలుసింహంబుచేరి ధిక్కృతి గంచు
             తల్పులఁగరుల డీకొల్పునాఁడు
    ఘనతరవిర్భర గండపెండరమిచ్చి
             కూఁతురాయలకును గూర్చునాఁడు

గీ. ఒడలెఱుంగవొ చచ్చితో యుర్విలేవొ
   చేరఁజాలక తలచెడి జీర్ణమైతొ
   కన్నడంబెట్లు చొచ్చెదు గజపతీంద్ర!
   తెఱుచినిలు కుక్కచొచ్చిన తెఱగు తోప. "

కృష్ణదేవరాయలు లేకపోవుటవలనను, ఈపోరాటముల మూలమునను తెఱచిన యింటివలె రాజ్యమున్నదను భావమును వెల్వరించెను. ప్రతాపరుద్రగజపతి దండెత్తివచ్చుటకుఁ బూర్వముననే నెల్లూరుమండల ప్రాంతప్రదేశమునంతయు నందు ముఖ్యముగా చంద్రగిరిరాజ్యమును, ఉదయగిరి రాజ్యమును అచ్యుతదేవరాయల వశమై యుండుటచేతను సాళువ వీరనరసింగరాయని సాహాయ్యముతో సైన్యముల సమకూర్చుకొని పోయి అచ్యుతదేవరాయలు ప్రతాపరుద్రగజపతి నెదుర్కొని గొప్పయుధ్ధముచేసి యోడించెను. అచ్యుతరాయల యాస్థానకవి యగు తారకబ్రహ్మరాజీయ గ్రంథకర్త రాధామాధవీయకవి గూడ నీవిజయమును దెలుపుచు నుత్కల ప్రభువుపట్ల నొకించుక దయను జూపెనని తెలిపియున్నాఁడు. ఈయుద్ధము 1529 లో జరిగియుండవచ్చును గాని యీదండయాత్ర సలుపుటకు ప్రతాపరుద్రగజపతికిఁ గొంతకాలము పట్టియుండును.