పుట:Thimmarusumantri.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

తిమ్మరుసు మంత్రి


అచ్యుతదేవరాయల పక్షమువారయిన వాని బావమఱదులు సలకము పెదతిమ్మరాజు, సలకము చిసతిమ్మరాజును చోళరాజ్యాధిపతిగనుండి అచ్యుతదేవరాయకిఁ బరమమిత్రుఁడుగా నుండిన సాళువ వీరనరసింగరాయని సహాయముతో నసంఖ్యములగు సైన్యములతో విజయనగరముపై దాడిసలిపి రామరాయాదులను రాజధాని నగరమునుండి పాఱఁద్రోలిన వెనుకనే అచ్యుతదేవరాయలను చంద్రగిరినుండి రప్పించి వానిని విజయనగరమున బట్టాభిషిక్తుని జేయుటయు, సాళువ వీరనరసింగరాయని ప్రధానమంత్రిగా నియమించిన వెనుకనే అచ్యుతదేవరాయలు రామరాయలతో మైత్రిచేసికొని పాదిరీక్వెరోజు వ్రాసిన చందమున జరిగియుండునుగాని కృష్ణదేవరాయలు 1529 వఱకు బ్రదికి యుండెనని చెప్పెడి విషయములు విశ్వాస పాత్రములుగాఁ గన్పట్టవు. 1526 సంవత్సరములోనే కృష్ణదేవరాయలు మృతినొంది యుండుటయే సత్యమగునుగాని యాతఁడు 1530 బ్రదికియుండెననుట విశ్వాసపాత్రముకాదు. అంతవరకు నతఁడు బ్రదికియున్నయెడలను, అతఁడు తనవెనుక నచ్యుతదేవరాయలను బట్టాభిషిక్తుని జేయవలసినదని యాజ్ఞాపించినపుడును, అచ్యుతదేవరాయలు తిరుపతి కాళహస్తులలో రెండుసారులు పట్టాభిషిక్తుఁడగుటకుఁ బ్రమేయము గానరాదు. కృష్ణరాయలు వెంటనే అచ్యుతదేవరాయలను తన దగ్గఱకు రప్పించుకొని తన సంరక్షణమున నుంచుకొనియే యుండును. అట్టి పనిచేసి యుండలేదు. అళియరామరాయలు కృష్ణదేవరా