పుట:Thimmarusumantri.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

తిమ్మరుసు మంత్రి


నమ్ముకొనియె తిరుపతిలోను, కాళహస్తిలోను రెండుమాఱులు పట్టాభిషిక్తుఁడై తానే విజయనగరసామ్రాజ్యాధిపతినని ప్రకటింపఁగలిగినవాఁడు. ఇందుచేతనే నెల్లూరుమండలములోని కమ్మరపూడిలోని యొకశాసనములో శా. శ. 1448 అగు పార్ధివసంవత్సరములో అనఁగా 1526 సంవత్సరములో అచ్యుతదేవరాయలు విజయనగరమున వజ్రసింహాసనమధిష్ఠించి సామ్రాజ్యపరిపాలనము చేయుచున్నట్లే తెలుపఁబడినది. ఇంతియగాక మైసూరుమండలములోని సిద్లఘట్టతాలూకాలోని వెరూసుపేటగ్రామములోని యొకశాసనములో శా.శ. 1450 అగు సర్వధారిసంవత్సరములో అచ్యుతదేవరాయలు చక్రవర్తివహించు "మహారాజాధిరాజ రాజపరమేశ్వరేత్యాది బిరుదావళితోఁ బ్రంసింపఁబడియుండుటయేగాక విజయనగరమందుండి సామ్రాజ్యపరిపాలనము చేయుచున్నటే తెలుపఁబడినది. ఈసంవత్సరము 1528 కాని 1529 సంవత్సరములో అచ్యుతరాయలు చెల్లప్పనే వీరనరసింగరాయనాయక సాళువ దన్నాయకరుని పుణ్యముకొఱకు తిరువాగిత్తీసుపురములోని ఉడైతంబిరానారు దేవాలయమునకు "పనైత్తాంగవ్ " అను గ్రామమును దానము చేసినట్లుగా ఉరత్తూరుశాసనమునఁ దెలుపబడినది. రాజు పుణ్యముకొఱకు నౌకరు దానముచేయుట కొంచెము విరుద్దముగఁ గన్పట్టకమానదు. అందులో విజయనగరసామ్రాజ్యసార్వభౌముఁడై యుండిన అచ్యుతదేవరాయలంతటివాఁడు తనకుమ్రొక్కి నమస్కరించెడి సామంతుని