పుట:Thimmarusumantri.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

తిమ్మరుసు మంత్రి


కాళహస్తిదేవుని సన్నిధానమున రెండవమాఱును రెండుతడవులేల పట్టాభిషిక్తుఁడు గావలసి వచ్చెను? అచ్యుతరాయలు రాజధానీనగరమైన విజయనగరమునకు రప్పింపఁబడకుండుటకుఁ గారణమేమి? తనకు పదునెనిమిది మాసముల కుమారుఁడుండఁగా వానివిడిచి తనరాణులను, సుప్రసిద్ధుఁడైన తనజామాత ఆర్వీటిరామరాజును కాదని తాను సింహాసనమెక్కినది మొదలుకొని యప్పటివఱకుఁ బదునాఱుసంవత్సరములకాలము చంద్రగిరిదుర్గములో ఖైదులోనుంచిన యచ్యుతరాయల నొక్కమాఱుగా నౌదార్యబుద్ధితో దనయనంతరము పట్టాభిషిక్తునిఁజేయవలెనని తనమరణశాసనములో వ్రాయించినట్టు వ్రాసినచరిత్రకారుఁడే కృష్ణరాయలమరణాంతరము "సాల్వని" అనునాతడు రాజ్యమునకంతకుమంత్రియై చంద్రగిరిదుర్గమునుండి యచ్యుతరాయలు విజయనగరమునకు వచ్చువఱకును రాజ్యపరిపాలనముఁ జేసెననికూడ వ్రాసినాఁడే.

పోర్చుగీసుచరిత్రకారుఁడయిన నన్నీజుచే, బేర్కొనఁబడిన “సాల్వనీ" మంత్రి 'సాళువతిమ్మరుసు' మంత్రియని భ్రమింపరాదు. ఏమన నాతఁడు చెఱలోనుంపఁబడి కన్నులఁ పెఱికింపఁబడినవాఁడని వ్రాసినదీ చరిత్రకారుఁడేయైనప్పుడు “సాల్వనీ” మంత్రి తిమ్మరుసని యెట్లర్థముచేసికొనఁగలము ? అతఁడు మఱియొకఁడై యుండవలయునుగదా. ఈసందర్భమున నీతనిచరిత్రము నొకించుక దెలుపవలసియున్నది. ఇతఁడుకాంచీపురవాస్తవ్యుఁడయిన తాళువకుళిందభట్టరను బ్రాహ్మణుని