పుట:Thimmarusumantri.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

తిమ్మరుసు మంత్రి


టయు, తాను ప్రేమించిన కుమారుఁ డాకస్మికముగా మృతి నొందుటయు, తనప్రాణములను గాపాడి తన్ననేకముధముల రక్షింపుచు సామ్రాజ్యమిప్పించి యింతయభివృద్ధికిఁ దెచ్చిన ప్రాణదాతను మంత్రిపుంగవుపట్ల కృతఘ్నుఁడై సుఖపడవలసిన వార్ధక్యమునఁ గన్నులుతీయించి హింసించుటయు మొదలగునవన్నియుఁ గలిసి ధురంతపరితాపమును గలిగించి యారోగ్యమును జెఱచుచుండుటచేత మొలకెత్తినజాడ్యము కుదుటఁబడక మఱింతవృద్ధియై రాజ్యపరిపాలనమును గూర్చి నూతసములయిన మార్పులను గావింపవలసి వచ్చెను. కృష్ణదేవరాయ లేసంవత్సరమున మృతినొందెనో సరిగా గుర్తించి చెప్పుట సాధ్యముగాక యున్నది. ఇతని వెనుక నీసామ్రాజ్యమును పరిపాలించుటకు వారసు లిర్వురుసోదరులును (అచ్యుతరాయలు, రంగరాయలు) అన్నకుమారుఁడు (నరసింహరాయలు) ను, పదునెనిమిది మాసముల వయస్సుగల శిశువు కృష్ణరాయని కుమారుఁడును గలరని సన్నీజు వ్రాసియున్నాడు. నన్నీజు ముగ్గురు సోదరులని వ్రాయుట పొరపాటు. ఇర్వురేగాని ముగ్గురుకాదనుట స్పష్టము. కృష్ణరాయలు తన మరణమునకు ముందు జబ్బుపడి జాడ్యముద్రేకించి యుండుటచేత నింకఁదాను బ్రదుకనని నిర్ధారణము చేసి యొక మరణశాసనము వ్రాయించెననియు, శిశువైన తన కుమారుని, తక్కినవారిని విడిచి, తన సోదరులలోఁ బెద్దవాఁడయిన అచ్యుతరాయలనే తనవెనుకఁ బట్టాభిషిక్తునిగాఁ జేయ