పుట:Thimmarusumantri.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

145


వచ్చువఱకుఁ దానే పరిపాలనము చేయుచుండవచ్చు ననికొనియెను. తన కుమారునికై తాను సింహాసనమును విడిచిపెట్టి 1524 సంవత్సరమున వానిని బట్టాభిషిక్తుని గావించి సామ్రాజ్యమునంతటను దెలియుటకై యెనిమిది మాసముల వఱకు సామ్రాజ్యమునం దంతటను మహోత్సవములు జరిపించుచుండె నఁట. 1525 సంవత్సరములోఁ గృష్ణరాయనికి చాల జబ్బుచేసి మంచమెక్కుట సంభవించెను. శా. శ. 1446 (గతించిన) తారణనాను సంవత్సర మార్గశిర శుద్ద 2 శనివారమునాఁడు (1525) కృష్ణరాయని కుమారుఁడగు తిరుమలదేవరాయని పేరిట శాసనములో కోనప్పనాయకుఁడను నొకానొకభృత్యుఁడు దేవరాయనికి గంగోదక మిచ్చినట్లు చెప్పబడి యుండుటచేత నితఁడు చావునకు సిద్ధమయ్యెనని తలంపవచ్చును. కాని చావలేదు. మఱికొంతకాలము బ్రదికియుండెను. ఇంతలో నాతని దురదృష్టవశమున నాకస్మికముగాఁ గుమారునకు జబ్బుచేసి మృతినొందుట సంభవించెను. తిమ్మరుసు శత్రువులగువారు తిమ్మరుసో వాని కుమారుఁడో కృష్ణరాయని కుమారునకు విషముపెట్టి చంపించినారను ప్రవాదమును బుట్టించి లోకమున వ్యాప్తి నొందింపసాగిరి. అట్టి ప్రవాద మానోట నానోటఁబడి యయ్యది క్రమముగా రాయల చెవులఁబడి యాతని కున్మాదము పుట్టించి యుండును.

అట్టి యున్మాదావస్థయందుండినప్పుడే యిట్టివైపరీత్యము జరిగియుండును. ఇట్లు తన మనోభీష్టమునకు భంగము కలుగు