పుట:Thimmarusumantri.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

తిమ్మరుసు మంత్రి


కెట్లో చెఱసాలనుండి తప్పించుకొని పోయి తసబంధువగు నొక దుర్గాధ్యక్షుని కడకుఁబోయి సైన్యములం గూర్చుకొని రాయనితో యుద్ధము చేయుటకు సంసిద్ధపడియెనఁట ! తరువాత రాయ లసంఖ్యాకములగు సైన్యములను బంపఁగా రాయల సైన్యములకును తిమ్మరుసు కొడుకు గోవిందరాజునకును గొప్ప యుద్ధము జరిగిన వెనుక గోవింద రాజు శత్రువుచేఁ జిక్కెనఁట! అంత నా శత్రువు వానిని బట్టుకొనివచ్చి రాయనికి నోప్పగించె నఁట : కృష్ణదేవరాయఁడు క్రూరుఁడై కృతఘ్నుఁడై తరువాత వారికన్నులను దీయించివేసెనఁట ! ఆవృద్ధబ్రాహ్మణుఁడు చెఱసాలలో మూఁడుసంవత్సరము లుండి స్వర్గస్థుడయ్యెనఁట!

ఇట్టి విషాదకధనమును వ్రాసి విన్పించినవాఁడు కృష్ణరాయని కొల్వుననున్న “సన్నీజ్ " అను పోర్చుగీసు చరిత్రకారుఁడు. ఇతఁడు 1520 మొదలు 1540 వఱకు నిరువది సంవత్సరముల కాలములోఁ బలుతడవులు విజయనగరమున సందర్శింపుచుండెనని తెలియుచున్నది. ఇతఁడు దక్క మఱియే పోర్చుగీసు చరిత్రకారుఁడుగాని, ఏ మహమ్మదీయ చరిత్రకారుఁడుగాని, ఆంధ్రకవులు గాని, కర్ణాటకకవులు గాని, మఱియెవ్వరుగాని యట్టికథనమును బేర్కొనియుండలేదు. ఇంతయ గాక గృష్ణరాయలు మృతినొందునాటికి నాతనికిఁ బదునెనిమిది మాసముల శిశువగు నొకకుమారుఁ డుండెననిగూడ నితఁడు వ్రాసియున్నాడు. ఈ సన్నీజు వ్రాఁతనుబట్టి కృష్ణరాయనికి