పుట:Thimmarusumantri.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(20)

దశమప్రకరణము

135


వాఁడైనయెడల వానిచర్మ మొలిపించఁబడును. నీచజాతివాఁ డైనయెడల నెట్టినేరము గావించినను వానితల సంతబజాఱులో నరికివేయఁ బడుచుండెను.

నేరములు చేసిన వారలకు విధింపఁబడెడి శిక్షలు క్రూరములుగాఁ గన్పట్టినను యుక్తాయుక్తవిచక్షణ లేకుండ గ్రుడ్డిగా విధింపఁబడుచుండ లేదనుటకుఁ బ్రబలసాక్ష్యము గలదు.

మఱియు తిమ్మరుసు ప్రోత్సాహము మూలముననే నూతనములయిన దేవాలయములును, మందిరములును, పట్టణములును, కాలువలును ప్రతిష్ఠాపింపఁబడి శిల్పకళలభివృద్ధిఁ గావింపఁ బడియెను. సామ్రాజ్యమున భూమియంతయుఁ గొలతవేయఁబడినది. సుంకములు గొన్ని మాన్పింపఁబడినవి. పూర్వము వివాహముపై సుంకము వేయుచుండిరి. ఇతఁడట్టి సుంకములను మాన్పించెను. దొరతనమువారి ద్రవ్యముతోఁ బ్రజోపకారములయిన కార్యము లనేకములు నెఱవేర్పఁబడినవి. ఇతని కాలమున సంస్కృతాంధ్ర కర్ణాటభాష లభివృద్ధి గాంచినవి. ఆంధ్రమునకు గౌరవము హెచ్చినది. ఇతఁడు దేవాల లయములకును విద్వాంసులయిన బ్రాహ్మణులకు భూదానములను బెక్కులను గావించుటయేగాక కృష్ణరాయనిచేతఁగూడ ననేక దానములను జేయించెను. మఱియు శైవమని, వైష్ణవమని భేదమునెంచక శివాలయములకుఁ విష్ణ్వాలయములకును సమముగా దానధర్మములను జరుపుచు వచ్చెను. ఈతని