పుట:Thimmarusumantri.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమప్రకరణము

131


మెంతకలదో యాకాలమునాటి శాసనములును, వాజ్ఞ్మయమును బరిశీలించిన వారికి బోధపడకమానదు. ఈసందర్భమున శ్రీకృష్ణదేవరాయనికి బ్రాహ్మణులయందెంత విశ్వాసముగలదో యాతనిచే రచింపఁబడిన 'ఆముక్తమాల్యద' యను ప్రబంధము నందలి యీక్రింది పద్యములను బట్టి మనము తెలిసికొనవచ్చును.

 
కం|| దుర్గములాప్త ద్విజవర
     వర్గమునకే యిమ్ము : దుర్గవత్తత్తతిక
     త్యర్గళధరాధి రాజ్య వి
     నిర్గత సాధ్వసత పొడమవిలుపకు కొలదిన్."
                        (ఆ. ఆ. 4. ప. 207)

"దుర్గములను నీకాప్తులయిన బ్రాహ్మణులకిమ్ము, వారి మీదికి నెట్టి శత్రువులు వచ్చినను వారిని నిర్భయులై తెగటార్చుటకు వారికి నీయనర్గళాది రాజ్యమువలన ఆదుర్గములందు వలసిన సేనాదులను సమృద్ధిగా నుంపుము; అల్పముగా నుంపకుము; లేదా, వారికి రాజ్యగర్వముచేత నీయెడలంగూడ భయము తప్పునట్లు సైన్యాధికమును ఎక్కువగా ఇయ్యకుము"

- (వేంకటరాయశాస్త్రి కృతసంజీవనీ వ్యాఖ్య. )

"ఆ. ఆనభిజాతుఁ గేకటాలయు నశ్రుతు,
    నలుకమాని బొంకు పలుకువాని,
    నాతతాయి, గడును నన్యదేశ్యు. నధర్ము.
    విడుము విప్రునేల వేడితేవి." (ప. 209)

"నీ దొరతనము నీకే ఉండవలయునని కోరెదవేని బ్రాహ్మణునైనను, నీచకులజుఁడు, బోయలనడుమ జీవించు