పుట:Thimmarusumantri.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

తిమ్మరుసు మంత్రి


లను గావించెను. సైన్యముల విషయమై జరిపిన సంస్కరణ మిదివఱకే తెలిపియున్నాఁడను. సైన్యములఁ బరీక్షించి సైన్యాధిపతులకు సైనికులకుఁ బహుమానము లిచ్చుటకు విజయదశమి యుక్తమైన దినముగఁజేసెను. తిమ్మరుసు సమర్ధులని తోచినప్పుడు బ్రాహ్మణులకు సయితము సైన్యాధిపత్యము లొసంగుచు వచ్చెసు. ఈసామ్రాజ్యమున బ్రాహ్మణులతో తిమ్మరుసునకుఁ దరువాత మహాసేనాధిపతిగా నున్నవాఁడు రాయసము కొండమరుసు (కొండమరాజు). శ్రీకృష్ణదేవరాయని పూర్వదిగ్విజయ యాత్రఁలోగూడ నుండుటయేగాక అదిల్‌సాహపై దండెత్తిపోయినపుడు లక్షసైన్యమున కధికారియై యాతని వెంటఁ బోయి తురుష్కులతో యుద్ధముచేసెను. తిమ్మరుసు తమ్ముఁడగు గోవిందరాజుగూడ కొండమరుసువంటివాఁడే. ముప్పదివేల సైన్యమున కధికారియై కృష్ణరాయని వెంటఁబోయి తురుష్కులతో యుద్ధముచేసి ఖ్యాతిఁ గాంచినవాఁడే. తిమ్మరుసు కొడుకు గోవిందరాజుకూడ దండనాధుఁడుగ నుండెను. అల్లసాని పెద్దిరాజు (పెద్దయ్యంగారు లేక పెద్దనామాత్యుఁడు), నంది తిమ్మనామాత్యుఁడు, కవులుమాత్రమేగాక మండలాధిపతులుగఁ గూడ నుండిరి. తిమ్మరుసు మేనల్లుండ్రను గూర్చి వ్రాసియే యున్నాను. ఈవిజయనగర సామ్రాజ్యము ప్రతిష్ఠాపింపఁబడినది. మొదలుకొని తుదికాలమువఱకు బ్రాహ్మణులవలనఁగూడ బెంపఁబడినదనుటలో సందేహము లేదు. ఈ సామ్రాజ్యముయొక్క ప్రతిరాజ్యాంగ శాఖయందును బ్రాహ్మణ ప్రాబల్య