పుట:Thimmarusumantri.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమ ప్రకరణము

తిమ్మరుసు తురుష్కులను జయించుట

అట్లు తిమ్మరుసుమంత్రి కృష్ణరాయనితోఁగలిసి సైన్యములను మరలించుకొని సురక్షితముగా నేతెంచి విజయనగరము ప్రవేశించిన వెనుక గోలకొండసుల్తాను మహమ్మద్ కూలీకుతుబ్‌షాహ లక్ష సైన్యముతో గొండవీటిపై దండెత్తివచ్చు చున్నాఁడని తెలియవచ్చెను. అతఁడు కృష్ణరాయనికి జెప్పి రెండులక్షల సైన్యములతో, దురుష్కులను జయించి కొండవీటిదుర్గముసు సంరక్షించుటకై బయలుదేఱెను. ఇట్లు బయలు వెడలి కొండవీడు సమీపించునప్పటికి కుతుబ్‌షాహ కృష్ణానదిని దాటి బెల్లముకొండను వశపఱచుకొని కొండవీటిదుర్గము సమీపమునకు వచ్చెను. అప్పు డుభయ సైన్యములకు భయంకరమైన యుధ్ధము జరిగెను. ఈయుద్ధమునందు ఆర్వీటినారపరాజు త్రిమ్మరుసునకు కుడిభుజముగానుండి కొండవీటికడ దురుష్కులతో గఠారియుధము గావించి కుత్బుషాను దల్లడిల్లఁగొట్టి తఱిమెను. ఇచ్చట సుల్తాను కూలీకుతుబ్‌షాహ తిమ్మరుసును గాని రాయనిఁగాని జయించినాఁడని ఫెరిస్తా వ్రాసినసంగతి సత్యముకాదు. [1] ఈయుద్ధమునందే తిమ్మరుసు తన్నెదిరించిన

  1. ఈ యుద్ధములోఁ గుతుబ్‌షాహతో స్వయముగాఁ బోరాడి యాతని నోడించినవాఁడు ఆర్వీటి నారపరాజని కళాపూర్ణోదయములోని యీక్రింది పద్యమువలన స్పష్టపడఁగలదు.

    "చ. వదలక యుత్కలేంద్రుని సవాయిటరీదు నడంచు దుర్జయుం
        గుదువనమల్కుఁ దల్లడిలఁగొట్టె మహాద్భుతసంగరంబులో
        నెదిరిచి కొండవీటికడ నెవ్వరు సాటి విచిత్రశౌర్యసం
        పదవన నారసింహవిభుపట్టికి నారనృపాలమౌళికిన్. "