పుట:Thimmarusumantri.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ఠమప్రకరణము

123


చుండిరి. ఇంతలో వారలకు నొత్తుడు కలుగనీయక తిమ్మరుసుమంత్రి రాయనియాజ్ఞఁ గైకొని గజపతికడకుఁ బోవఁ నతఁ డర్హవిధానముల బహుమానపురస్సరముగాఁ బూజించి సంధిని గూర్చి ప్రసంగించుచుండెను. అందుల కనువగురీతిని తిమ్మరుసు ప్రసంగించి ప్రతాపరుద్రగజపతి రాయనితో సంధిచేసికొని తన కూఁతునిచ్చి వివాహము గావించుటకు నొడంబఱచెను. తరువాత ప్రతాపరుద్రగజపతి తనరూఁతురు తుక్కాంబ నిచ్చి వివాహము గావించెను. ఈమెనే యన్నపూర్ణాదేవియని యాముక్త మాల్యదయందు కృష్ణరాయఁడు మఱియొక నామమునఁ బేర్కొనియెను. శ్రీకృష్ణదేవరాయఁడు సంతోషించి రాజుమహేంద్రపురమువఱకును గలదేశమును మరల గజపతికొసంగి క్రీ. శ. 1516 వ సంవత్సరములోనే పూర్వదిగ్విజుయాత్రను ముగించి స్వస్థానమునకుఁ జేరుకొనియెను. తిమ్మరుసు చేసిన మోసమువలన పాత్రసామంతులకు బ్రాణభంగము కలుగలేదు. కృష్ణరాయని విజయప్రతిష్ఠకు భంగము కలుగలేదు. ప్రతాప రుద్రగజపతికి పదభ్రష్టత్వమును కలుగలేదు. భవిష్యత్కాలమున నుభయరాజ్యములకుఁ బోరాటము కలుగకుండ బాంధవ్వమును గల్పించెను. ఇంతయును తిమ్మరుసు కృష్ణరాయనితో గూడ నుండుటచే సంభవించినది. అట్లు కానియెడల చరిత్రము మఱియొక రూపము దాల్చియుండును.

__________