పుట:Thimmarusumantri.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(18)

అష్ఠమప్రకరణము

119


పాత్రసామంతుల యుద్దము.

కృష్ణరాయఁడు తమపట్టణముమీఁద దండెత్తి వచ్చుచున్నాఁడని విని 1 బలభద్రపాత్రుఁడుఁడు, 2 దుర్గాపాత్రుఁడు, 3 భీమాపాత్రుఁడు, 4 ముకుందపాత్రుఁడు, 5 భీకరపాత్రుఁడు 6 బేరుపాత్రుఁడు, 7 రణరంగపాత్రుఁడు, 8 ఖడ్గపాత్రుఁడు, 9 ఆఖండలపాత్రుఁడు, 10 మురారిపాత్రుఁడు, 11 వజ్రముష్టిపాత్రుఁడు, 12 తురగరేవంతపాత్రుఁడు, 13 గజూంకుశ పాత్రుఁడు, 14 అసహాయపాత్రుఁడు, 15 మృగేంద్రపాత్రుఁడు, 16 మఱియొకపాత్రుఁడు, (పేరు తెలియదు) ఈపదునాఱుగురు పాత్రసామంతులును తమకు గలుగఁబోవు నవమానమును భరింపఁ జాలక రోసావేశపరవశులై ప్రతాపరుద్రగజపతి సన్నిధి కేగి రాయలరాకను విన్నవించి యవశ్యము రాయనిం గెలిచి పట్టి యిచ్చెదమని పంతములు పలికి యుద్ధమున కనుజ్ఞ యిమ్మని ప్రార్థింపఁగా నాతఁడు మిక్కిలి సంతోషించి యట్లు గావించెను. ఆ మహావీరాగ్రగణ్యులై పాత్రసామంతులు లక్షలకొలఁది సైన్యములం జేర్చుకొని కర్ణాట సైన్యముల నెదుర్కొని ఘోరాహవమును మొదలు పెట్టిరి. అధికముగా గర్ణాట సైన్యములకు నష్టము కలుగుచుండెను. దేశ మరణ్యమయమై యుండుటయుఁ సైనికులు మార్గాయాసముకతన రోగగ్రస్తులై యుండుటయు, శత్రుసైనికులు స్థానబలిమిచే స్థిరచితులై నిలిచి పోరాడుచుండుటయును, గన్నులార వీక్షించి