పుట:Thimmarusumantri.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ఠమప్రకరణము

113


బెల్లముకొండదుర్గము, నాగార్జునకొండదుర్గము, తంగేడుదుర్గము, కేతవరదుర్గము, కొండవీటిదుర్గము మొదలగునవి గజపతిరాజ్యలోనివి. ఇవి యన్నియును, గృష్ణానదికి దక్షిణభాగమున నున్నవి. వీని కన్నిఁటికిని ముఖ్యస్థానము కొండవీఁడు. ఈకొండవీటి దుర్గమునందు ప్రతాపరుద్రగజపతి కుమారుఁడు వీరభద్రగజపతి నివసించు చుండెను. ఉదయగిరిదుర్గమును కృష్ణదేవరాయఁడు ముట్టడించె నని విని వీరభద్రగజపతి కుమారహంవీర మహాపాత్రునికుమారుఁడు వీరభద్ర పాత్రుఁడు, రాచూరి మల్లఖానుఁడు, ఉద్దండఖానుఁడు, పూసపాటి రాచిరాజు, శ్రీనాధరాజు, లక్ష్మీపతిరాజు, పన్యామలకసవాపాత్రుఁడు, పశ్చిమ బాలచంద్రమహాపాత్రుఁడు మొదలుగాఁగలనాయకు లనేకులను జేర్చుకొని కర్ణాటసైన్యముల నెదుర్కొని కొంతకాలము పోరాడియు బహిరంగ ప్రదేశమున నిలువం జాలక పలాయితుఁడై కొండవీటిదుర్గములోఁ దాఁగొనియెను. తిమ్మరుసు గజపతిసైన్యములను దఱుము కొనుచుఁబోయి వరుసగా అద్దంకిసీమ, వినుకొండసీమ, బెల్లముకొండసీమ, నాగార్జునకొండసీమ, తంగేడుసీమ, కేతవరముసీమ, కొండవీటిసీమ వశపఱచుకొనియెను. పూసపాటి రాచిరాజు తక్క తక్కిననాయకు లెల్లరును కొండవీడు దుర్గములోఁ బ్రవేశించిరి. రాచిరాజుమాత్రము కృష్ణ దాటి పోయెను. రాచిరాజు ప్రతాపరుద్రగజపతియల్లుఁడు. ఇప్పటి