పుట:Thimmarusumantri.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(17)

అష్ఠమప్రకరణము

111


కాల్బలమును, నాలుగువందల గుఱ్ఱములును గల సైన్యమును దుర్గములోనికిఁ జేర్చుకొని దుర్గమును సంరక్షించుచుండెను. తినుబండారమున్నంతవఱకు నీస్వల్పసైన్య మెంతకాలమైనను, ఎంతసైన్యము ముట్టడించినను నిలిచి పోరాడఁగల సామర్థ్యము గలిగి యుండెను. ఒకచిన్నత్రోవఁ దక్క దుర్గమునకుఁ బోవ వేఱొకదారి లేక యుండెను. ఇట్టి యభేద్యమైన దుర్గమును శ్రీకృష్ణదేవరాయఁడు ముట్టడించెను. దుర్గములోనివారికాహార పదార్థము లందకుండఁ జేసిన దుర్గమును వశపఱతురని తిమ్మరుసును రాయలును నిశ్చయించి కోటను ముట్టడించి విడిచి యుండిరి. ఇంతలో గజపతి లక్షసైన్యమును దుర్గసంరక్షణార్థము పంపించెనుగాని, అప్పటికే శత్రుసైన్యముచే ముట్టడింపఁబడి యుండుటచేత నాసైన్యము వచ్చిన ప్రయోజనము లేకపోయెను. తిమ్మరుసు దండనాథాగ్రణి గజపతిసైన్యము వచ్చుచున్న వార్త విని ఉదయాద్రిముట్టడికై రాయసము కొండమ రుసయ్యను వాని సైన్యములను నిలిపి కృష్ణరాయని నాదళవాయికిఁ దోడ్పాటుగా నుండి దుర్గమును వశపఱచుకొనవలసినదని చెప్పి తక్కిన తనసైన్యము నంతయుఁ దరలించుకొని శత్రు సైన్యమున కెదురుగాఁ బోయి మార్కొని ఘోరసంగ్రామ మొనరించుచుండెను. రాయసము కొండమరుసయ్య రాయనితోఁ గలిసి యత్యుత్సాహముతోఁ గోటను బదునెనిమిది