పుట:Thimmarusumantri.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(16)

సప్తమప్రకరణము

103


స్కరమని నాయభిప్రాయము. అతఁడు నీతమ్ముఁ డగుటంజేసి నే నేమనుకొందునోయన్న సంకోచముచేతఁ బ్రశంసింపక యున్నాఁడవు గాని నీవుమాత్ర మెఱుంగవా? అట్టి సంశయముఁ బెట్టుకొనకుము. తురుష్కులనుండి యేవిధమైన యుపద్రవమును నగరమునకుఁ గలుగకుండ సంరక్షించుభారమును మీతమ్ముఁడు గోవిందామాత్యునిపైఁ బెట్టుము. అతఁడు సామర్థ్యమున నీకుఁ దీసిపోవువాఁడు కాఁడు. మఱియును నీవు సకలసైన్యాధ్యక్షుఁడవై పూర్వదిగ్విజయయాత్రను నడుపుము. నేను నిన్ను వెంబడించి వచ్చెదను.

అని పలుకఁగా నతనిబుద్ధికౌశల్యమును మెచ్చుకొని తన యెడఁజూపు విశ్వాసమునకు సంతసించి చిఱునవ్వు నవ్వుచు మరల యిట్లనియెను. మహాప్రభూ ! మేము బ్రాహ్మణులము. క్షత్రియులు నిర్వహింపవలసిన మహాకార్యములు మావలన నగునా? ఏల యిట్లు పలుకుచున్నావు. సర్వసైన్యాధిపత్యము నీవంటి సాహసవిక్రమార్కులు వహింపవలసినవారు కాని నావంటి వృద్ధబ్రాహ్మణుఁడుగాదు. అని పలికెను. అందులకు శ్రీకృష్ణదేవరాయఁ డిట్లు బదులు వక్కాణించెను. అప్పా ! ఇవెందుకు వచ్చినమాటలు ? మీరు బ్రాహ్మణు లగుదురుగాక! మున్ను కౌరవులకుఁ బాండవులకు విద్యాగురువైన ద్రోణాచార్యుఁడు కౌరవులపక్షమున నుండి సర్వసైన్యాధిపత్యమును వహించి పాండవాద్యనేకక్షత్రియవీరు లెందఱితోఁ బోరాడి యుండలేదు? కృపాచార్యుఁడు నశ్వత్థామ మొదలగు సేనాపతు