పుట:Thimmarusumantri.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

తిమ్మరుసు మంత్రి


నించినఁ గుపితుఁడై తిమ్మరుసును రాయనిగూడ తనపట్ల నలక్ష్యముగలవారై యున్నవారని తలపోసి మహోగ్రుఁడై యీక్రింది యుత్పలమాలికను జెప్పెనఁట.

ఉ. లొట్ట యి డేటిమాట పెనులోభులతో మొగమోట మేల తాఁ
    గుట్టక యున్న వృశ్చికము గుమ్మర పుర్వని యందురే కదా
    పట్టపురాజుపట్టి సరిపల్లెసరాసరి యీయ కున్న నేఁ
    దిట్టక మాన నామతము తీవ్రమహోగ్రభయంకరంబుగాఁ
    దిట్టితినా మహాగ్రహమతి౯ - మకరగ్రహజర్జరీభటా
    పట్టపుదట్టఫాలఫణిభర్తృబహూకృత పర్జటస్ఫుటా
    ఘట్టనదట్టణాలకవిఘట్టనిరర్గళరాజభృత్యకీ
    చట్టచటార్భటీనయనజర్జరకీలలు రాలఁ గా వలెన్
    జుట్టరికంబునం బొగడఁ జూచితినా రజతాద్ర్యధిత్యకా
    పట్టణమధ్యరంగ గతభవ్యవధూవదనానుషంగసం
    హట్టశిరస్థ్సగాంగఝరహల్ల కజాలసుధాతరంగముల్
    చుట్టుకొన న్వలెన్ భువనచోద్యముగా భయదంబుగా మఱిన్
    దిట్టితినా సభాభవనధీంకృతభీమనృసింహరాడ్డ్వజా
    తాట్టమహాట్టహాసచతురాస్యసముద్భృకుటీతటీనటీ
    కోట్టణరోషజాలహృతకుంఠితకంఠగభీరనాదసం
    ఘట్టవిజృంభమాణగతి గా వలె దీవనపద్య మిచ్చి చే
    పట్టితినా మణీకనకభాజనభూషణభాసురాంబరా
    రట్టతురంగగంధగజరాజదమూల్యఘనాతపత్రభూ
    పట్టణచర్మహర్మ్యభటపం జ్త్కిచిరాయురనామయంబు నై
    గట్టిగఁ దోడుతో వెలయ గా వలె నెక్కువఠీవిఁ జూడుఁడీ
    య ట్టిటు మందెమేలముల నందఱనుంబలెఁ జుల్కఁ జూచి యే
    పట్టున నైనఁ గేరడము వల్కకుఁ డీపయిపెచ్చు నందులన్