పుట:The Verses Of Vemana (1911).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన పద్యములు.

ద్వితీయ భాగము.

         సూక్ష్మ - రూపమె'రిగి, సుఖమొందగా లేక
         బహులముగను జదువు బడుచు నరుడు;
         చావు చేటె'రుగని చదువే'ల చదువుడో?
         విశ్వదాభిరామవినరవేమ. 1

         ఉత్తముని కడుపుననో'గు జన్మించిన
         వాడు చెరుచు వాని వంశమె'ల్ల;
         చెరుకు వెన్ను పుట్టి చెరచదా తీపెల్ల? వి. 2

_____

BOOK II.

1. A young man who is unable to see the recondite form of God can enjoy no comfort, but studies excessively; why does he study that which would teach him how to die.

2. If a wicked son is born from the womb of the excellent, he will destroy his entire race; as an empty ear growing on a sugarcane destroys all its sweetness.