పుట:The Verses Of Vemana (1911).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          ఆలి మాటలు విని, యన్న దమ్ముల రోసి,
          వేరు బడెడు వాడు, వెర్రి వాడు;
          కుక్క తోక బట్టి గోదావరీ దునా; వి. 133

          స్త్రీలు గల్గు చోట, చెల్లాటములు*[1] గల్గు;
          స్త్రీలు లేని చోటు చిన్నబోవు;
          స్త్రీలచేత నరులు చిక్కుచు న్నారయా. వి. 134

          మాల మాల గాడు, మహి మీదనే' ప్రొద్దు;
          మాట తిరుగు వాడు మాల గాక;
          వాని మాల యన్న - వాడె (పో) పెను మాల. వి. 135

          చిప్ప లోను బడ్డ చినుకు ముత్యంబా'యె
          నీళ్ల బడ్డ చినుకు నీళ్ల గలసె;
          ప్రాప్తము గల చోట ఫలమే' ల తప్పునో? †[2] వి. 136

133. He is a fool, who listening to his fractious wife, quits his brothers and separates himself from them. Can a man swim in the Godaveryi by holding on to a dog's tail?

134. Where there are Women, there is sportː the town would be ruined but for women ; men are indeed in the hands ‡[3] of women.

135. Consider not him a Pariar of degraded rank who is so by birth ; he who breaks his word is far viler. He who reproaches the Pariar is (go to) worse than him.

136. The drop that falls into the oyster-shell becomes a pearl, while the drop that falls into the wave turns to water ː if the situation be suitable, the fruit shall not fail.

  1. * In another M S. బిందు లోన పడ్డ బిడ్డడు పుట్టదా.
  2. † A1. కొరకు for చేత.
  3. ‡ A1. చెలాటం.