పుట:Tenugutota.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనుగు తోట

మంగళాచరణము

ప్రొద్దుపొడుపు నోములు నోమ బూనినావొ?
చిట్టిబొట్టు కుంకుమ బెట్టు చిన్న దాన !
ధవళకీర్తిదుకూల సుందరము లయిన
యాసలు పిఱుందు లంటు సోయగ మ దేమొ?
కడల నెల్ల నాకర్షించి కనులు గుట్టు
తెనుగు మీఱీన గరువంపు దీరు లేల?

క్రాలు గనుల కాటుక నిగారంపు బసల
మోహపెట్టుచు నున్నావు ముగ్ధజనుల,
పడుచుదనపు సింగారంపు బెడగుసిరుల
వలచి వలపించు చున్నావు వయసుకాండ్ర,

పరమవాత్సల్య దృష్టులు మరులు కొలువ
బ్రేమకలితాంధులై రెల్ల వృద్ధజనులు.
ఏమిటికి నీయుదయకేళి యిగురుబోణి!
గిలుకు టొడ్డాణ మింత బిగించి తేల?

10