ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెనుగు తోట
5
తల్లిపాల్ ద్రావకుండ బందాలబడిన
వత్సములు లాగులాడెడు పాలకొఱకు
ఆలకొట్టాల పెండెము లవల నెట్టి
మెడలవేసిన పలుపులు విడువ రమ్మ.
తల్లిపాలు ద్రావిన మహోత్సాహపూర్తి
బెనగి చెల్లాట లాడెడు పెంపు మిగుల
నిరుగు పొరుగు లేగల క్రీడ లరయ వమ్మ !
బువ్వదుత్త నెత్తిన బెట్టి నవ్వుకనుల
రవిక దొడుగని గొల్లకుఱ్ఱది యొకర్తు
పోవుచున్నది పొం దైన ముద్దునడల,
కలికి యొడిసెల వలెవాటుగాగ దాల్చి
పిఱుదు లసియాడ జీర రాపిళ్ళు పెరయ
కాపుగూతురు పొలములు కావ నేగు
చిన్ని బంగారు పూసల చెండ్లవంటి
జొన్నకంకులు పండిన సొగసుచేల
ఎక్క డెక్కడ నుండియో చక్క వచ్చి
వ్రాలుచున్నవి పిట్టలు వేలు వేలు;
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము.
18