ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెనుగుతోట
శన్యుషస్సుల దిలకలాంఛనము లీయ
బోయితిని జన్మపూ రుపభూములందు;
అడిగె గ్రమ్మఱ మఱునాడు నట్లె యతడు;
నాడు గూడ నించుక పూతనవ్వు నవ్వి
కన్నె కక్షత లిచ్చుచు గదలిపోతి;
అల తృతీయదినారంభ మందు మఱల
వ్రతహితాచార సరణి తప్పకయ యుండ
బయలుదేఱితి నానందనియతితోడ,
తోడిచెలియ యొక ర్తె కౌతుకము పొరల
పాటబాడెను ననుజూచి ప్రమదమునను,
నవనవానందవర్ష తాండవవిలాస
మధుర మధురంబ యగుట నా మంజుగీతి
నాలకించితి నించుక యాలసించి;
చూడవచ్చిన ప్రాయంపుజేడె లెల్ల ,
పిలువబోయిన తొలికారు చెలువ లెల్ల
స్వాగత నయాభిముఖ మైన పాటబాడి
12