పుట:Tenugutota.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనుగుతోట


ఆఱి యాఱని యార్ద్రనీలాలకములు
మెడల బొరలాడ పాయలు ముడువ వేల?
నగవుపూదండ లెట్టి కాన్కలు! కుమారి !
ఎచటి కేగెదు? నోముపే రేమి? తల్లి !
ఎవ రధిష్ఠానదైవము? వృత్త మెద్ది?
తీయని తెనుంగుమాటల దెలుప వమ్మ?
కన్నె వయిన తెనుగునాటి చిన్నదాన !

అనుచు నను బల్కరించె శుభాంగు డొకడు
ముగ్ధుడయ్యును సోదరమోహ వశత
మధురసల్లాప కౌతుక గ్రధితుడగుచు,
మాటలాడంగ నెంతయో మనసుపడిన
సోదరుని జూచి చూడని చూడ్కి జూచి
విని వినని యట్లు తొలిసందె చనితి నవల;

ధరణిని ద్వితీయవిఘ్నముల్ తగ వటంచు
నోము బట్టించిన జనయిత్రీమతల్లి
శిరసు మూర్కొని మొదల వచించె; నట్లె
శుక్రవారోదయముల నుపక్రమించి

11