పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

71


    ముదితశతగోపకన్యకా వద నతులిత
    లలితరుచిబొల్చె రాకాకళాధరుండు.

సీ. నడతు నీక్షేత్రంబు నకుజెయిదాఁచి
               యర్చింతు నీనమ్మిన సేవకులను
    మ్రొక్కుదు నీపాదములకు జిహ్వావీధి
               నీనామములు వక్కాణింతు నెపుడు
    అర్పింతు నీసేవకై సర్వ దేహంబున
               జింతింతునీలీల జిత్తసరణి
     దనివోక నీచక్కదనము సంవీక్షింతు
               నీయవధానంబు నెమ్మివిందు

తే. బ్రహ్మరుద్రాదులకుఁ గానఁ బడని నీవు
     నేడునా మ్రోల నిలిచితి నీలవర్ణ
     వర్ణనాతీతమత్ప్రాభవప్రవృత్తి
     వుణ్యపరిపాక మేరికిఁ బొగడదరమె !

శా. ప్రారంభించిన వేదపాఠమునకుం బత్యూహమౌనంచు నో
     యేరాతమ్ముడ నన్నుఁజూడ జనుదే విన్నాళ్ళనోయుండి చ
     క్షూరాజీవయుగంబువాచె నినుఁగన్గోకున్కి మీబావయున్
    నీరాకన్మదిఁ గోరుజంద్రుపొడుపున్ నిరాకరంబుంబలెన్.

మ. వలనాయేటికి నాశ్రయించి మనఁగా వానీరమున్ నీరమున్
     దలవెఱ్ఱేపచరింప నేటికి సమద్దానంబు దానంబున
    చ్చలమాయేటికి నెత్తిగట్టుకొనఁగా సన్యాసమున్న్యాసమున్
    గలిఁదేజాలు మదీయభక్తిరుచి భక్తశ్రేణి కశ్రాంతమున్.

సీ. నిలువుననొలిపించే విలువంగడము నెల్ల
                 శరముల యాయంబు బొరయుటడిపెఁ
    దగశబ్దమాత పాత్రముచేసె గుణలత
                 మ్రాకునగట్టించె మూలబలము