పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

63


    యంగుళీసంజ్ఞ సమయములఁ బ్రత్యేకంబు
                మునుముల్పలోనికిఁ జననొనర్చి

తే. ద్వారపార్శ్వస్థ వేధికాలువల జరక
    రక్షివర్గంబు టంక్రియారభటి వఱలు
    వలయమకూటాదికంబుగ నిలచిమ్రొక్క
    నగవుఁ జూచుచు నాతఁడు నగరుజొచ్చి

సీ. సనకసనందనాది నిఖలాంతర్వాణి
               హృల్లీనభావంబు సల్లపెట్టి
    విశ్వంభరాభోగ వివిధమూర్త్యంతర
               స్ఫురితానుభావంబు బుటలువైచి
     శింశుమారాకృతి స్వీకృతి వైకుంఠ
               షట్కవిహారంబు జారవిడచి
     క్షీరోజమధ్యస్థలీ రత్నసగజుషా
               గర్భనివాసంబు కచ్చువడలి

తే. పుండరీ కేక్షణుండు శిఖండిబర్హ
     మండితశిఖండకుఁడు సతాఖండలుండు
     పుండరీకుని మానసాంభోపీఠి
     మిండతుమ్మెదయైయుండు నిండుకొలువు.

సీ. తనువుతోఁ జరియించు ధర్మ దేవతవోలె
                  మెలఁపున వనవాటిఁ గలయదిరిగి
    గణనమీరిశాఙ్గి౯ గుణములు హృదయసం
                  పుటినించు క్రియనిరుల్ బుట్టిఁబెట్టి
    తనకుఁ బవిత్రవర్ధనమె కృత్యంబను
                  కరద నూతనకుశోత్కరము గూర్చి
    యపవర్గ ఫలసిద్ధి హణీనైనఁ జేపట్టు
                  కైవడి బహుఫలోత్కరము లొడిచి