పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


    విస్తీర్ణపణిపనివ్యస్తవస్తువ్రజ
    ప్రకటితరత్న గర్భాజఠరము

తే. విపులపవమానతాండవ వేపమాన
    లాంఛనధ్వజపటల పల్లవలలామ
    మాళిరచితకళాకృత్య హేళిహయము
    దీపితంబగు శ్రీకాశికాపురంబు.

సీ. పద్మినీపద్మాత పత్రంబు శిథిలప
             త్రాగమై రాయంచు యాశ్రయించె
    దాలుస్రవత్ఫేన జాలంబుతో ఘోణీవి
             పంచలరొంపి వలంచి యాడె
    దూరోద్గమద్దావధూమ మంబుదబుద్ధి
             నెమ్మిలోపొదనుండి నిక్కిచూచె
    జఠరస్థజలము నాసానాళమునఁ బీల్చి
             సామజంబిరుప్రక్కఁ జల్లుకొనియె.

తే. నరసిపైనీరు కలకల దెరలి విపిన
    సకలవిధులు నిర్మృగోచ్చయములయ్యె
    మిట్టమధ్యాహ్నమిది సుధామధురవాణి
    యర్హమిచ్చోఁబథశ్రమ మపనయింప.

సీ. వీడియం బెడలించి విధురత్నకనకాలు
                కాంచితాంబువు పుక్కిలించి యుమిసి
     యుదిరి బంగరువ్రాత హొంబట్టు వలెవాటు
                సడలించి వెనఁగట్టి స్థలినిజుట్టి
     యనయాయి పృధుకహస్తాంతరన్య స్తోప
               దోచితార్థము తానె యుద్వహించి