పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

61


     బొందుగావించెనా భువినెట్టి ఖలునకు
                 నాదట కరుణాప్రసాద మొసంగు

గీ. మంత్రిమాత్రుండై దుర్మంత్రిమధవకధన
    చారుచర్చామత్కార చక్రవర్తి
    యద్రివిభుఁడు విరూరివేదాద్రి రామ
    భద్రపాదసరోరుహ బంభరంబు

సీ. వృషరేంద్రగమనుఁడీ వేదాద్రినాధుండు
               గిరిరాజతనయ యీతిరుమలాంబ
    వేదనిశ్శ్వాశుండు వేదాద్రినాధుండు
               ధృతి శారదాంబ యీతిరుమలాంబ
    విహగేంద్రగమనుఁడీ వేదాద్రినాధుండు
               శరధితనూజ యీతిరుమలాంబ
    విబుధాధినాధుఁడీ వేదాద్రినాధుండు
               ధర శచీదేవి యీతిరుమలాంబ

గీ. యనగననుకూలదాంపత్య వినుతమహిమ
    హరువుదీపించెనౌర వేదాద్రివిభుఁడు
    హరియశుఁడైన కలకాళహస్తితనయ
    తిరుమలాంబయు నిత్యవర్ధిష్ణులక్ష్మీ.

సీ. శ్రీకలోదయవధూలోకానన ప్రభా
               నాటితబహుచంద్ర నాటకంబు
    సమవిర్దగళిత భాషారత్న మంజరీ
               యోజితకధ్యా ప్రపూజనంబు
    కైలాసశైల సంకాశ సౌధనివేశ
               కౌముదీకనచిత గగనతలము