పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

     రంగయామాత్యువరదయ్య ప్రకటశౌర్య
     ధారివాచాధర ధారిశయ్య

సీ. పట్టెవట్రువయును బరిపుష్టికట్టు
               గుడిసున్న కియ్యయు సుడియముడియు
    నైత్వంబు నేత్వంబు నందంబు మందంబు
               గిలుకయు బంతులు నిలువు పొలుపు
    నయము నిస్సందేహతయు నొప్పుమురువును
               ద్రచ్చివేశినయట్ల తనరుటయును
    షడ్వర్గశుద్ధియు జాతియోగ్యతయును
              వృద్ధిప్రియంబును విశదగతియు

తే. గీసకొనివ్రాయసంబులు వ్రాయవ్రాయ
    గొంకుకొసరును జేతప్పు గొనకయుండు
    లలితముక్తాఫలాకార విలసనమున
    మతిమరున్మన్త్రి వేదాద్రి మంత్రివరుఁడు.

తే. మాద్రిమీరు విరూరివేదాద్రిరాజు
    దాన ధారార్థ నఖిలప్రధాననదుల
    వెచ్చపెట్టుకిట దలయో విబుధతటిని
    తరుశశిమౌళిజడలలో డాఁగియుండు.

సీ. కరుణించిచూచెనా కవిగాయకార్ధార్థి
                నివహగేహంబుల నెఱయుసిరుల
    కోపించిచూచెనా కొండతో నెనవచ్చు
                ననవచ్చు నతడైన నవనిదూఱు
    మెచ్చి మన్నించెనా మెదుక పాలసుడైన
                దొరతనంబువచ్చి పరిఢవించు