పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

59

    జయయుతుండై న రామానుజయ్యసుతుఁడు
    భద్రగుణసీరి విరూరివేదాద్రిశౌరి.

సీ. సంహృతాంహస్ఫూర్తి సింహాసనుండు నృ
              సింహవిక్రముఁడు నృసింహశౌరి
    త్రయ్యంతవాసనాగ్రహబుద్ది నొయ్యారి
              యొయ్యారి రామానుజయ్యగారు
    గంగాతరంగ సారంగలాంఛనదీప్తిఁ
              బొందుకు కీర్తికి రంగరాజు
    శరణాగతత్రాణ కరుణాచరణ కేళి
              వరదరాజులబోలు వందరాజు

తే. ననఁగ శ్రీరామవిభునికి నంబకున్ను
    గలిగి రాచంద్రతారార్క గతిఁ బ్రశస్తి
    సలువురాత్మజు లౌదార్య సలిలనిధులు
    భుజగ బాయికి నాలుగు భుజములట్లు.

సీ. సమకూర్పఁగా నేర్చు సకలవైష్ణవశాస్త్ర
              సిద్ధాంతశుద్ధాంత సిద్ధిగరిమ
    హవణింపఁగా నేర్చు నఖిలావని చక్ర
              సామ్రాజ్యపూజ్య విశాలలక్ష్మి
    వలసింపఁగా నేర్చు వాలారుఁజూఫుల
              కోపులు చూపు చకోరదృశల
    బాలింపఁగా నేర్చు బాంధవ కవిగాయ
              కార్యార్థినివహంబు నెనుదినంబు

తే. దండనాథునిమాత్రుఁ డె దశదిశావ
     కాశ సంపూర్ణవిజయ ప్రకాశశాలి