పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[8]

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

57


పాండురంగ మహాత్మ్యము నందలి

ప్రబంధ పద్యరత్నములు

సీ. అవతారమందె నే యఖిలైక జనమంత్రి
              కలశరత్నాకర గర్భభీమ
    దోబుట్టువయ్యె నే తులత కాంచనవర్ణ
              వెలదివెన్నెలగాయు వేల్పునకును
    బాయకయుండు నే పరమపావనమూర్తి
              చక్రిబాహామధ్య సౌధవీధి
    నభిషేకమాడు నే యభివర్ణితాచార
              దిగ్గజానీత మౌ తేటనీట

తే. నవనిధానంబు లేదేని జ.....సరకు
    లమ్మహాదేవి శ్రీ దేవి యాదిలక్ష్మి
    సరసశుభదృష్టి రామానుజయ్యసుతుని
    నాదరించు విరూం వేదాద్రినాథు.

సీ. సూత్రవతీదేవి సొబగుపాలిండ్లపై
                మలుపచ్చిగంధంపు వలపుతోడ
    శిరసులు వంచు నిర్జరుకోటిఁ బనిగొను
                తపనీయ వేత్రహ స్తంబుతోడ
    బనియేమియని విన్నపముసీయు సుమనోర
                ధములయిన దివ్యాయుధములతోడ
    బ్రహ్మాండకోటుల పారుపత్తెములెల్లఁ

తే. శాఙ్గిన్ రెండవమూర్తియై జగములేలు
     మునిమనోహరి శ్రీసేవ ముదలియారి