పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

గీ. నాంధ్రభూమీ కుచాగ్రహారాభమైన
    శ్రీ తెనాల్యగ్రహార నిర్ణేతవగ్ర
    శాఖ కాకోకిలమవీవు సరసకవివి
    రమ్యగుణకృష్ణ రామయ రామకృష్ణ

క. కౌండిన్యసగోత్రుఁ డవా
   ఖండలగురువిభుఁడ నఖిల కావ్యరససుథా
   మండనకుండలుఁడవు భూ
   మండల వినుతుఁడవు లక్ష్మమావర తనయా.

క. యశము కలిగించు నీమృదు
    విశదోక్తులఁ బౌండరీకవిభుచరితుఁ జతు
    ర్దశభువన వినుమతముగ శుభ
    వశగతి నాపేర నుడువు వరతత్త్వనిధీ.

ఉ. స్కంధపురాణ వీరనిధికౌస్తుభమై ప్రభవించు దేవకీ
    నందను సత్క థోద్యమ్ము నవ్యకవిత్వకళాకలాపమన్
    కుందనమున్ ఘటించు, కడుఁగొత్తగు సొమ్మొనరించి విష్ణు సే
    వందిలకించు నప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా.

మ. ఉదయంబస్తవగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా
     విదితంబైన మహిన్మహాంధ్రకవితా విద్యాబలప్రౌఢి నీ
     కెదు రేరీ సరసార్దబోధఘటనా హేలాపరిష్కార శా
     రదనీరూపము 'రామకృష్ణకవిచంద్రా! సాంద్రకీ ర్తీశ్వరా!

తెనాలిరామకృష్ణకవి క్రీ. శ. 1505 సం|రమునకుఁ బూర్వము వాఁడని చరిత్ర వాకొనుచున్నది. శ్రీకృష్ణదేవరాయల యాస్థానమునఁ "బేరుగన్న యష్టదిగ్గజముల నీతఁ డొకడని చెప్పుదురు. అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుఁడు. ధూర్జటి