పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


శ్లో. శాకాబ్దే బహుధాన్యనామననభోనేత్రాబ్ది చంద్రాన్ని తే
    కార్తీక్యాం శశివాసరే శుభతిథే సింహాచలస్వామినే
    హారంకర్ణ విభూషణేన కటకే శ్రీకృష్ణరాయాధిపా
    మాత్యారాచయ సాళ్వతిమ్మ నృపతిః ప్రాదాద్విజన్మాగ్రణిః

నాటినుండియు, తిమ్మరుసుమంత్రి రామకృష్ణునియెడ నాదరాభిమానములు గలిగి మెలంగుచుండెను,


26 తిలకాష్ఠ మహిష బంధనము

రాయల యాస్థానమున కొకనాడు రామశాస్త్రి యను పండితుడు వచ్చి 'రాజూ! నేను తర్క వ్యాకరణ పండితుడను. తమ యాస్థానమున విద్వాంసులను గెలుచుట కేతెంచినాను' అనగా రామకృష్ణకవి 'అయ్యా! శాస్త్రిగారూ! తమరు కవిత్వముకూడ చెప్పగలరా?' యని ప్రశ్నించెను.

'వెధవకవిత్వమే చెప్పలేనా? అదికూడ గొప్పయేనా?' అని యా శాస్త్రి పలికెను.

'అయితే మీరు నిస్సంశయముగా వెధవకవిత్వము జెప్పగలరని తలంతును -'

'వెధవకవిత్వము – పునిస్త్రీ కవిత్వము నని రెండురకముల కవిత్వము లున్న వా?'

'మీరే యన్నారుకదా, వెధవకవిత్వమే చెప్పలేనా యని అందుచేత మీకెందు బాండిత్వమున్నదో యెఱుంగవచ్చునా?'

'తర్కవ్యాకరణములందు' --

అయితే ఒకమాట --త్రియంబక , అనుపదమునకున్న యధికారసూత్రమును దెలుపుడు—'

త్రి+అంబక :--ఇది ద్విగుసమాసము.