పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[6]

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

41


24 భాగవతము

కూచిపూడినుండి రాయలకడ ప్రదర్శించుటకై యొకప్పుడు భాగవతులువెళ్లిరి. రాయ లొకనాడు వారిప్రదర్శనమునకు నిర్ణయించెను. రామకృష్ణుడు వచ్చినచో నేదో యల్లరి నారంభించి కథ సరిగా జరుగనీయడని తలంచి, పహరావారితో 'ఏమైనను సరే రామకృష్ణుని రానీయవలదు' అని చెప్పెను. ఈసంగతి రామకృష్ణకవి తెలిసికొని వ్యస్తచిత్తుడై యెటులైన భాగవతముఁజూచి తీరవలయునని, మారువేషమున నచటికేగెను. కావలియున్న భటులు చర్మ వేషధారియైన రామకృష్ణుని కంఠస్వరమునుబట్టి గుర్తించి లోనికి బోనీయరైరి. రామకృష్ణుడెంతబతిమాలినను లాభములేకపోయెను. తుద కాతడొక యుక్తి పన్నెను.

'ఓరీ మిత్రులారా! ఒకమాట చెప్పిదను. శ్రద్ధగా వినుడు. ' రాయలు నేడందరకు నేదోయొక బహుమానమిచ్చును. ఆబహుమానము నాకక్కర లేదు. మీయిరువురకు బంచియిచ్చెదను. నన్ను లోనికి పోనిండు' అని రామకృష్ణు డాకావలివారల కాశపెట్టెను. భటులంగీకరించి, రామకృష్ణకవిని లోనికిబోనిచ్చిరి. కృష్ణుని యల్లరి చేష్టలను యశోదతో గోపికలు చెప్పుచుండునట్టి ఘట్టము భాగవతులచే బ్రదర్శింప బడుచుండెను. యశోద కృష్ణునిచీవాట్లు పెట్టుచుండెను, రామకృష్ణుడు మెల్లగా నాభాగవతులనుసమీపించి కృష్ణపాత్రధారుని కఱ్ఱతోగొట్టగా, నాతడు కుయ్వోయని యేడ్వసాగెను. ఎవరాయల్లరియని రాయలు ప్రశ్నింప భటులు ' రామకృష్ణకవి' అనిరి.

'ఎందుల కావేషధారిని కొట్టినా'వని రాయలు కవిని నిరోధించి యడుగగా నాతడు 'మహారాజా! యశోద కృష్ణుని మందలించుటయేగాని కొట్టుట బ్రదర్శింపని యీభాగవతుల భాగవతమెంత