పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


నూనిపోసి యంటించి 'వాయుసూనుడు సముద్రములో మంటల నార్చుకొనె'నని నూతికడకుబోయి స్నానముచేసి, తనయిల్లంతయు నట్లు చిందరవందర చేసినందుల కలోయని యేడ్చుచున్న యావేశ్య వంక చూచి 'దీనినే ప్రత్యక్షపురాణమందురు. తెలిసినదా' అని వెడలిపోయెను. చిత్రాంగి రోదసీకుహరము ప్రతిధ్వనించునట్లు విలపించును దిన్నగా న్యాయాధికారికడకు బోయి ఫిర్యాదుచేసెను. రామకృష్ణకవివెళ్ళి, న్యాయాధికారికి యదార్ధమంతయు విన్నవించెను న్యాయాధికారి 'చిత్రాంగీ! నీవట్లుకోరుట నిజమేయగుచో నాతడట్లు జేయుటలో దప్పేమియును లే'దని మందలించి పంపెను.

రామకృష్ణకవి ! విజయనగరమునకు దిరిగివెడలి, రాయలను సందర్శించినంతనే, రాయలు 'కవిచంద్రమా; నెల్లూరు నెరజాణల సౌందర్యమును వర్ణింపుము' అని యడుగ, రామకృష్ణు డిట్లాశువుగా బద్యమును రచించి, చదివెను-

సీ. మొలక చీఁకటి జల జల రాల్పగరాదె
              నెరులు మించిన వీరి కురులయందు
    కెరలించి యమృతంబు గిలకొట్టగారాదె
              ముద్దుచూపెడి వీరిమోములందు
    పచ్చబంగారు కుప్పలు సేయగారాదె
              గబ్బుమీరిన వీరి గుబ్బలందు
    పండువెన్నెలతేటఁ బ్రభవింపగారాదె
              నగవు గుల్కెడి వీరి మొగమునందు

గీ. నౌర! కరవాడిచూపుల యాఘళంబు
    బాపురే! భూరికటికటీ భార మహిమ
    జలు మదగజగమనలక్షణములౌర
    నేర్పుమించెదరప్పురి వారసతులు,