పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


కానతిచ్చితిని. నీ వెట్లు బ్రతికివచ్చితివి?' అని ప్రశ్నింపగా, రామకృష్ణుడు జరిగినదంతయు జెప్పెను. ఆతని యుక్తికి రాయ లపరిమితాహ్లాదము నొందెను.


19 విష్ణుచిత్తీయ విమర్శన

రాయలు సకల సామంత మంత్రి పురోహిత బంధుమిత్రపరివార సమాకీర్ణంబై న కొలువుకూటమున గూర్చుండి కవుల నుద్దేశించి యిట్లనెను.

'కవీంద్రులారా ! మద్విరచితమైన విష్ణుచిత్తీయమును మీ రందఱును జదివియుంటిరిగదా ! ఆగ్రంథమునందలి గుణావగుణముల దెలిపిన వారికి మంచి బహుమానమిత్తు' న నెను. ఏమాటయన్న నేమి కీడుమూడునో యను సందేహించి, యెవ్వరును నేమియుజెప్పక యూరకుండగా, రామకృష్ణుడు లేచి, 'మహారాజా! 'పెక్కు నసందర్భపువాక్యములతో గూడియున్న యాగ్రంథము విమర్శించుట కే మున్నది? ఇచ్చట నేమియునులేదు- భోజనముజేసి పొమ్ము' అనుటలో నర్ధమున్న దా!' యనెను.

రామకృష్ణకవీ ! నాగ్రంథ మసందర్భముగా నున్నదా? నీ మాటలసందర్భముగా నున్న వా! ఎప్పుడును బరియాచకమేనా'యని రాయలడుగ, రామకృష్ణుడు 'మహారాజా ! పరియాచకమాడుట కే నెంతవాడను, ఉన్నదున్నట్లుగనే చెప్పితిని, వలయునేని యొకపద్యమును నిదర్శన పూర్వకముగ జదివి చూపింతును.

శా. 'ఆనిష్టానిధిగేహసీమ నడు రేయాలించినన్ మోవియున్
     తేనాగేంద్ర శయాను పుణ్యకథలుం దివ్యప్రబంధాను సం
     ధానధ్వానమునాస్తి శాకబహు తా, నాస్త్యుష్ణతా, నాస్త్యపూ
     పో, నాస్త్యోదన సౌష్టవంచ కృపయాభోక్తవ్యమన్నల్కులున్ •