పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[5]

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

33


చున్నతరి రామకృష్ణుఁడేగి రాయలతో నేదియో పరిహాసమాడెను. రాయలుకోపపరీతచిత్తుఁడై భటులబిలిచి 'సమయాసమయములెరుగక పరియాచకములాడు రామకృష్ణకవిని కఠములోతు గోయిత్రవ్వించి, యందు కంఠమువఱకుఁ బాతిపెట్టించి, కుంజరములచే, ద్రొక్కింపు డనెను. రాయలట్లు కఠినముగా నాజ్ఞాపించుటచే భటులు చేయునది లేక , రామకృష్ణకవి నూరివెలుపలకుఁ గొనిపోయి, గోయిత్రవ్వి పాతిపెట్టి ఏనుగును దెచ్చుటకై యంతఃపురము కడకేగిరి.

ఆసమయమున కొక గనిచాకలి యామార్గమునఁ బోవుట తటస్థించెను. బట్టలను రేవునుండి యింటికి: గొంపోవుచు నతఁడు రామకృష్ణునిఁ జూచి 'బాబూ ! ఇది యేమి? త మ్మెవరిట్లు కంఠము వఱకుఁ బూడ్చినారు?' అని యడుగ, నాతఁడు 'ఓరీ చాకలీ! నాకుఁ జిరకాలమునుండి గూనియున్నది ఆ గూనిపోవుటకిట్లు చేసితినని' అనెను.

'ఆహా! ఎంత యదృష్టమండీ! బాబూ ! తమ గూని బోయినదా?'

నన్ను 'బైకిదీసినచో దెలియునుగాని, గోతిలోనుండి నేనెట్లు చెప్పగలను? నన్ను బైకిదీసినచో దెలియునుగదా!'

బాబూ ! మిమ్ము పైకిఁ దీసెదను గాని మీకుఁ బోయినచో నాగూని కూడ పోవుటకు తమరు సాయము చేయవలయును' అని యాచాకలి గోతిలోని మట్టినిఁ దీసి, రామకృష్ణుఁ డీవలికి రాగానే 'బలే ! బలే! మీగూనిపోయినది' అని తానాగోతిలో దిగెను. రామకృష్ణుఁడు మఱల మన్నుఁబూడ్చి వెడలిపోయెను. కొంతసేపైనపిదప రాజభటులు ఏనుగును గొనివచ్చిరి. చాకలి జరుగనున్నది గ్రహించి 'బాబూ! నేను రాజుగారి చాకలి' నని గట్టిగా ఏడ్వసాగెను. రామకృష్ణుఁడు చేసిన మోసమును గ్రహించి భటులు చాకలిని విడిచిరి. రాయలు రామకృష్ణుని జూచి 'నిన్ను జంపుమని గదా నేను భటుల