పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

జాతక తాళ యుగ్మలయసంగతిచుంచు విపంచి కామృదం
గాతతతేహితత్తహితహా ధితదంధనుధానుదింధిమి
వ్రాతనయానుకూలపద నారికుహూద్వహహారికింకిణి
సూతనఘల్ఘ లాచరణనూపుర ఝాళఝళీమరంద సం
ఘాత వియద్దునీ చక చక ద్విక చోత్పల సారసంగ్రహా
యతకునూర గంధవహహారిసుగంధ విలాసయుక్తమై
చేతముచల్లఁ జేయవలె జల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీ ఫలమధుద్రవగోమృత పాయస ప్రసా
రాతిరసప్ర సారరుచిర ప్రదంబుగ సారెసారెకున్.

రాయలంతట నానందభరితాత్ముడై కవిగండ పెండేరము నిచ్చి బహూకరించెనట. ఆగండపెడేరియిముం ధరియించి, పెద్దన కవి గర్వమును ప్రకటించుచు నొకనాఁడు సభలో నందఱును వినునట్లు శిష్యుల నుద్దేశించి యిట్లు పద్యములో సగము భాగమును జదివెను-

“చ. వదలక మ్రోయు నాంధ్రకవి వామపదంబున హేమసూపురం
      బుదితమరాళకంఠనినదోద్ధతి నేమనిపల్కు పల్కె రా”

రామకృష్ణుఁడు మిగతభాగము నిట్లు పూరించెను—

చ. 'సడలక మ్రోయు నాంధ్రకవివామపదంబున హేమనూపురం
     బుదితమరాళకంఠనినదోద్ధతి నేమనిపల్కు పల్కె రా
     గుదియల కాలినుండదగు కోమలకంధర భాగ్యరేఖ నీ
     నుదుటను లేదులేదనుచు నూఱు తెఱంగుల నొక్కిపల్కెరా?'
     పెద్దనకవి సిగ్గునొంది యానాటినుండి యట్లనుట మానివై చెను.

18 రామకృష్ణుఁడు-గూనిచాకలి.

కృష్ణరాయలొకప్పు డతిజరుగురగా శత్రురాజులపై దండెత్తుటను గూర్చి మంత్రివర్గముతో సహస్యాలోచనం బొనరించు