పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

31

ఉ. “ముద్దుగ గండపెండియరమున్ గొనుఁడంచు బహూకరింపఁగా,
     నొద్దిక నాకొసంగుమని యొక్క రుఁ గోరగ లేరు లేరొకో

అని యూరకుండఁగా పెద్దనకవిలేచి –

పెద్దనబోలు పండితులు పృథ్విని "లేరని నీ వెఱుంగవే
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా

అని యీక్రిందిమాలిక నాశువుగా జెప్పిను -

ఉ. “పూతమెఱుంగులుం బసరుపూప బెడంగును జూపునట్టివా
     కైతలు? జగ్గునిగ్గునెనగావలె గమ్మన గమ్మనన్వలెన్
     రాతిరియున్ పవల్ మరపురానిహొయల్ చెలియారదంపుని
     ద్దాతిరితిపులో యనగ దారసెలవ్వలె లోదలంచినన్
     బాతిగబైకొనన్ వలెను బై దలికుతుకలోని పల్లటీ
     కూతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
     జేతికొలందిఁగౌఁగిటను జేర్చినకన్నియ చిన్నిపొన్ని మే
     ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిజూచినన్
     దాతొడనున్న మిన్నుల మిఠారపుముద్దులగుమ్మ కమ్మనౌ
     వాతెఱదొండపండువలె నాచశిగానలెఁ బంటనూదినన్
     గాతలఁదమ్మి చూలిదొరకైన పసపుంజవరాలి సిబ్బెపు
     న్మే తెలి యబ్బురంపుజిగి నిబ్బర వుబ్బ గబ్బిగుబ్బపొం
     బూఁతలపూనెకాయ సరిపోడిమి కిన్నెర మెట్లబంతిసం
     గాతి ప్రసన్న బంతి బయకాడపుఁ గన్నడగౌళపంతుకా
     సాతతతాతానంపనన్ దివుటాడెడు గోటమీటుబల్
     మ్రోతలనుంబలెన్ హరవు మొల్లముగావలె నచ్చ తెన్గు లీ
     రీతిగ సంస్కృతం బుపచరించెడు పట్టున భారతీవధూ
     టీ తపనీయగర్బవికటీ భవదానవసర్వసాహితీ
     భౌతిక నాటక ప్రకర భారతసమ్మత ప్రభా
     పాతసుధాప్రపూర బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ