పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[4]

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

25

రుద్రాక్షాక్షం పంక్తివిభ్రమము లీరూఢిన్నిరూపింప నీ
శూద్రప్రజ్ఞలు విప్రవిత్కవి వచస్ఫూర్తిన్విడంబించునే?

క. కెంగేల రామకృష్ణుని
   బంగరు కడియంబు లుండఁ బండితుఁ డగునా
   జంగులు జల్లులు గల్గిన
   సింగారపు టూరకుక్క సింగంబగునా?

13 అమవసనిశికిన్

శ్రీకృష్ణదేవరాయ లొకనాఁటి ' మధ్యాహ్నమున నిండు పేరోలగంబుండి.

'క. కలనాటి ధనములక్కఱ
    గలనాఁటికి దాచ కమల గర్భుని వశమా'

యని చదివి, మిగత రెండుపాదములునుబూ ర్తి చేయుమనఁగా నలసాని పెద్దనకవి లేచి,

‘నెలనడిమనాఁటి వెన్నెల
యలవడునే నాడుఁబోయ నమవసనిశికిన్'

ఆపద్యము నాకర్ణించి, రామకృష్ణుఁ డిట్లు జదివెను---

క. ఎమితిని సెపితివి కపితము
    బ్రమపడి వెఱిపుచ్చకాయ వడిఁదిని సెపితో
    ఉమెతకయను దినిసెపితే
    యమవసనిశి యన్నమాట నలసని పెదనా!

'అమవస నిశికిన్' యను ప్రయోగము మంచిదికాదను నుద్దేశముతో రామకృష్ణకవి యిట్లాక్షేపణం బొనరించెను. పెద్దన కుత్కృష్ఠత నాపాదించుచు దనకు నికృష్ఠత నాపొదించుకొని రామకృష్ణుఁ డిట్లు పద్వముఁ జెప్పెను .