పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

'ఉ. పాటునకింతులోర్తురె కృపారహితాత్మక ; నీవు దోపని
     చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపియ
     ప్పాటలగంధి వేదననెపంబిడి యేడ్చెఁగలస్వరంబుతో
     మీటునవిచ్చు గబ్బిచను మిట్టల నశ్రులు చిందువందగన్ ,
                                                                     (మనుచరిత్ర)

'ఉ. ఈసునబుట్టి డెందమున హెచ్చిన కోపదవానంబులచే
     గాసిలియేడ్చెఁ బ్రాణవిభుకట్టెదురన్ లతాంగి పంకజ శ్రీ
     సఖమైన మోముపయిఁ జేల చెరంగెడి బాల పల్లవ
     గ్రాసక షాయకంఠకలకంఠనధూకల కాకలీధ్వనిన్.' (పారిజా)

శా. ఆజాబిల్లి వెలుంగు వెల్లికలడాయన్' లేక రాకా నిశా
     రాజశ్రీ సఖమైన మోమునఁ జటాగ్రంబొత్తి యెల్గెత్తి యా
     రాజీవాసన యేడ్చెఁ గిన్నరవధూ రాజత్కరాంభోజకాం
     భోజీమేళవిపంచిసుధాపూరవంబు తోరంబుగాన్". (వ.చ)

రామకృష్ణకవి 'మహారాజా! చెప్పుట కేమున్నది? 'పెద్దన్నగారియేడ్పు అటు యిటూ ఉన్నది. ముక్కుతిమ్మన్నగారి యేడుపు ముద్దుముద్దుగా నున్నది. భట్టుమూర్తిగారు మాత్రము బావురుమని యేడ్చినా'రనెను అందరును గడుపులుబ్బునట్లు నవ్విరి. భట్టుమూర్తికిఁ గోపమువచ్చి, చుర చుర జూడసాగెను. రామకృష్ణకవి 'ఓభట్టుమూ ర్తీ ! నీకవిత్వముఁ గూర్చి నేనట్లు విమర్శించినానని కోపగించినావు కాఁబోలు' నని యీ క్రింది పద్యములఁ జది వెను—

'క. చీఁపర పాఁపర తీఁగల
    జేఁపలబుట్టల్లినట్లు చెప్పెడి నీయీ
    కాఁవుఁ గవిత్వపుఁ గూతలు
    బాపనకవివరునిచెవికిఁ బ్రమదం బిడునే?'

శా. ఆద్రిస్నిగ్ధతలంబు బుద్బుదము లుద్యద్దారు భూషావళుల్
    క్షుద్రాదుంబర పాకపక్వఫలముల్ శుర్త్వంతరాకాసముల్.