పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[2]

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

9


జరుగదు అని చెప్పిరి. సరేయని రామకృష్ణుడు తగిన యదనుకై నిరీక్షించుచుండెను,

రాయలొక నాఁడు కొలువుకూటమున నున్న కవుల నందరను దిలకించి యిట్లు సమస్యనిచ్చి పూరించుమనెను.

'చ. స్తుతమలియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో
     యతులిత మాధురీమహిమ........

రామకృష్ణకవి లేచి యిట్లు పద్యములోని మిగిలిన భాగము పూర్తిచేసెను.

     ......హా తెలిసెన్ ! భువనైక మోహనో
     ద్ధతకుమారవార వనితాజనతా ఘనతాపహారిసం
     తతమధురాధరోదితసుధారసధారలఁ గ్రోలగాజుమీ!

వారాంగనపాన మొనరించుటచేతచే ధూర్జటి కవిత్వ మంత రసవంతమై యున్నదను భావము నలుగురకు బోధపడుటనే ధూర్జటి సిగ్గుపడి వికటకవి నేమియు ననఁజాలక యూరకుండెను. రాయలు ధూర్జటిని కొన్నిరోజులలైనపిదప నంతఃపురమునకుఁ బిలిపించి, వేశ్వ సహవాసము మానుమని మందలించెను.

5 దొంగలచే నీరు తోడించుట

శ్రీకృష్ణదేవరాయ లొకప్పుడు కైదీలను బరీక్షించుటకై కారాగృహమున కేగెను. అపరాధులందరును దమతమ యపరాధములను రాయల కెరింగించుచుఁ దమకు నిర్బంధవిమోచనముఁ గలిగింపుమని ప్రార్థించుచుండిరి. ఇరువురు దొంగలు రాయలు తమ్ము “మీరు చేసిన యపరాధములఁ దెలుపు' డనినంత నే యిట్లు చెప్పిరి. మహారాజా! మాకు చౌర్యమున నద్భుతము ననుపమానము నగు నేర్పు కలదు. మేము గజదొంగలము. ఈవృత్తిని మానుదుము