పుట:Telugunaduanuand00srirsher.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

In conclusion, I beg to point out that there is a great need in Vernacular Literature of books containing witty and painless observations on social matters; it is such literature that has done so much in moulding the present polished manners of European countries. I therefore beseech my readers, to take the remarks contained herein in the spirit in which they are offered and to encourage me to bring out the other parts of the work.

DASU SRIRAMULU

Ellore 15-7-1899

పీఠిక

శ్రీనాథుని 'వీధినాటకము' ననుసరించి కొంతవరకు వ్రాయబడినప్పటికి వానికిని నా పుస్తకమునకును అనేక విషయములలో భేదమున్నటులఁ జదువరుల కందరకు విశదము కాఁగలదు. శ్రీనాథుని వీధిలో నాంధ్రస్త్రీ వర్ణనము మాత్ర మతి శృంగారముగా వర్ణింపబడియె. ఈ నా పుస్తకములో శ్రీనాథుని లోనున్న యా యతి శృంగారము గానరానీక తెనుఁగు దేశపువారల ప్రకారములు మాత్రము కొంచెము చమత్కృతితో స్వాభావికముగా వర్ణించితి. ఈయది తెనుగు దేశములలోఁ గల ముఖ్యవర్ణముల వారిని వర్ణింప నుద్యమించిన నా 'తెలుఁగునాడ'ను మహావీధిలో 'బ్రాహ్మణ ప్రశంస' యను ప్రథమభాగము. ఇందు ఆంధ్ర బ్రాహ్మణులలోని పలు తెఱఁగులవారి కులవర్తనములు, ఆచార వ్యవహారములు, వేష భాషలు మున్నగునవి వ్రాయుఁబడియుండె. ఇందొక తెగను గుఱించి వ్రాసిన వర్ణనలు మఱొక తెగవారికి సంబంధించుననియు నియ్యది నిష్పక్షపాత బుద్ధితో వ్రాయబడియుండలేదనియుఁ గొందఱందురేమో. కవిత్వపు పస చెడకుండ సాధ్యమైనంత నిష్పక్షపాత బుద్ధితో నాశక్తి కొలఁది వర్ణించియుంటినే గాని వేరొండు గాదని చెప్పగలను. ఇదియునుంగాక మనదేశములో బ్రాహ్మణ జాతిలోఁగల వివిధ శాఖలవారు అనవసరముగాఁ గల్పించుకొను వివాదలు తగ్గింపవలెనని నా యుద్దేశము. బ్రాహ్మణ శాఖలలో వివాహ సంబంధము లుం