పుట:Telugu bala Satakam PDF File.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43. పెద్దలెపుడు ప్రేమ పెల్లుగా చూపంగ
పిల్లలందు తప్పు పెరుగుచుండు
'అతిని 'వదలినపుడె అత్యంత శుభమౌను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

44. ప్రక్కనున్న వారి వస్తువులను చూచి
దొంగిలించు బుద్ధి దోషమగును
ప్రక్క వారి సొమ్ము పామని భావించి
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

45. కోర్కెలుండ వచ్చు కోాను కోటులు
తీర్చగలరొ లేదొ తెలిసి కొనుచు
తల్లిదడ్రి నడుగ ధర్మమై యుండును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

46. జగడమాడరాదు జతనున్న వారితో
స్నేహ భావమెపుడు చెదరరాదు
కలుపుగోలు తనము ఘనతను గూర్చును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

47. ఆంగ్ల భాషమిాదా అధిక వాంఛలు చూపి
తల్లి బాసనేమో తరుగ చేయ
ఉచితమగునె మనకు ఊహలోనైనను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

48. ఆంగిలేయు లెపు డొహడలి పోయినగాని
వారి భాష మనల వదాలకుండె
పోయె బిడ్డ కాని పోదుపురిటికంపు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


14 తెలుగు బాల శతకం