పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నడుమునవచ్చిన వార్తలు చైనాయెడ సానుభూతిచూపువారికి యుత్సాహ కరములుగనున్నవి. చైనావారు, జపానుదాడిని ప్రతిఘటించి నిలుచుటయేకాక కొన్నిచోట్ల జపానువారిని చాలావరకు వెనుకకుతరుమగలిగిరి. అంతేగాక, 40000 మంది జపాను సైనికులు ఉన్నప్రదేశమునకు చుట్టునుగల ప్రదేశమును చైనావారు ఆక్రమించు కొనిరి. ఈ 40000 మందియును చైనావారిని తప్పించు కొని బయటబడుట కష్టమేను. అంతేగాక ఇన్నాళ్లు తటస్థముగనుండిన చైనా రెడ్ సైనికదళముకూడ, చైనావారి పబ్లిక్ సైనికులతో చేరుటవలన చైనావారికి మరింత యుత్సాహముగనున్నది. జపానువారు విషవాయువును యుపయోగించు చున్నారనియు అందువలన చాలమంది సైనికులు చనిపోవుచున్నారనియు చైనా అధ్యక్షుని భార్య వ్రాయుచున్నది.

                            ఇటలీ:-
   అబ్నిస్సీనియాలోనున్న ఇటాలియను ఆఫీసరులకు యెదురుతిరిగి ఆబెస్సీని యనులు 38 మంది ఇటాలియను ఆఫీసరులను చంపివేసిరి.
   ఇటలీయందు ఫాసియిజమునకు వ్వతిరేకప్రచారము చేయుచున్నందుకు చాలమందికి కఠినశిక్షల విధింపబడినవి.
   యుద్దమువలన చాలవరకు పాడైన ఆడిస్ అబాబా నగరమును పునర్నిర్మించుకొనుట మాని వేసినట్లు ముసొని తెలుపూన్నాడు.
                           స్పెయిను:-
   స్పెయిను అంతర్యుద్ధముకూడ యింకను జరుగుచునే యున్నది.  ప్రభుత్వ కార్యస్థానము మాడ్రిడ్ నుండి బార్సిలో నా నగరమునకు మార్చబడినది.
   సాలమాలకారవద్దనున్న విద్రోహులను వెళ్లగొట్టుటకు ప్రభుత్వసైనికులు చేసిన ప్రయత్నములు వ్యర్ధమాయెను.  విద్రోహపక్షమువారే జయమును పొందిరి.
    స్పెయినునుండి ఇటాలియను వాలంటీర్లు వెళ్లినచో విద్రోహుల బలము చాల వరకు తగ్గవచ్చును.
                        తాటప్ధ్యోపసంఘ సమావేశము:-
   స్పెయినునందు వాలంటీర్లుగ పనిచేయుచు విద్రోహులకు పనిచేయుచున్న ఇటాలియను సైనికులను రప్పించి వేయవలయునని ఇటలీపై బట్టు