పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"కన్ఫూషియాస్ నీతియుతమగు కవితను, ఇతిహాసములను, మిక్కిలి యానందముగ చదువుచుండును. కాని యాయనకు ప్రియతమమగు విషయము సత్ శిక్ష, సదుపదేశములు. ఆయన ఇట్లు నుడివియుండెను. "నేనెప్పుడును ద్వివిషయముల గూర్చి బోధింపుచుందును. అందొకటి సత్సాధన, రెండవది అసత్యనర్జనము."

"జీవితమందు నాలుగు విషయముల నభ్యసించుము. (1) సత్యము (2) సద్బావము (3) విద్య, (4) సాధుత్వము."

"మహాపూరుషులను జీవితావస్థయందు దర్శించుట దటస్థింపకున్నను, ఒక మహావ్యక్తిని, లేక యుత్తమ మానవుని దర్శించిన చాలును. సత్సంగప్రాప్తి దుర్లభము. కావున సద్విషయముల గూర్చి ప్రసంగించువారు దొరకినను తృప్తిపడుము." "ఆహా మనమెట్టి సౌభఆఘ్యావంతులయు! ఏవిధమగు అన్యాయకార్య మొనర్చినను లోకులు వెంటనే తెలిసి కొందురు గదా."

కన్ఫుషియస్, మిక్కిలి గాన ప్రియుడు. ఒక్కొక్క కీర్తనను పలుమారు పాడించి విని సంతసింపుచుండును. ఒక సందర్భము నిట్లునుడివియున్నాడు.

"నేను జ్ఞానినని సాహసించి యెవరితోడను నుడువజాలను. కాని నేను పెద్దమనుష్యుడ నని మాత్రము చెప్పగలను. జ్ఞానప్రేమలు నాయందెచ్చట నున్నవి? నాకు జ్ఞానతృష్ణకలదు. ఉపదేశము లొనర్చు చుండుటను నిచ్చగింపుచుందును"

"పెద్ద మనుష్యులు, ధీరులును, ప్రేమికులునై యుందురు. సాధారణు లెల్ల ప్పుడు వాక్యవ్యయ మొనర్చుచుందురు."

"నేను మిక్కిలి గంభీరుడను. కాని కోమల హృదయుడను. నేను కఠోరుడను. కాని కఠినుడనుకాను. నేను శ్రద్దాయుతుడను కాని చపలుడనుకాను."

"సాధనచేయవలయునను తలంపు నీకు గల్గినప్పుడు నీయధీనమందుండు కాల మత్యల్పమని యెఱుంగుము."

"నేనెప్పుడును జ్ఞానవిషయమును, ప్రేమ విషయమునుగూర్చి మాటలాడను. ఏలయన, అవి నాబుద్దికి అతీతవిషయములు."