పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"అజ్ఞాతమగు దాని దెలిసికొనుటయే జ్ఞానము"

"బడికి కట్టుటకు కొయ్యబద్దెలును, లగాములుండినగాని, గుఱ్ఱము బండినిలాగజాలదు. అటులనే మానవుడు విశ్వాసస్వతీతముగ బ్రతుకజాలడు. సత్యమని యెఱింగినదానిని ఆచరణయందు బెట్టజాలనివాడు సత్సాహస భీరుడు."

"శ్రధాస్యతీతముగ ప్రేమసంభవము కాదు. సహజసౌందర్యమున నలరారు ప్రాకృతిక శోభకును, అలంకారముల కృత్రిమసౌందర్యమున కుండు భేదమే శ్రద్ధాన్విత ప్రేమ శ్రద్ధావిహీన ప్రేమలయందు బొడగట్తు చుందును."

"గతించిన విషయములను గూర్చి నేను మాటలాడను. దేనినైనను స్థిరీకృత మొనర్చుటకు నేనెవ్వరిని దూఱను. జగిరిన కార్యమును గూర్చి నె నెవ్వరిపైనను నిందమోపను."

"దానహీనమగు ధనము. శ్రద్ధావిహీనమగు నేన దు:ఖవిహీనమగు శోకము- అర్ధవిహీనములు."

"ప్రీమయే సకలవిషయముల కంటె సుందరమును-సుశ్రీయని గ్రహింపనగును. ప్రేమ విహీనుడగు మానవుడు ఆభావనములను సహింపజాలదు. వాని సౌభాగ్యముగూడ చాలదినములుండదు. ప్రేమిక హృదయమందలి ప్రేమయే శాంతిని కలిగించును. కాని జ్ఞానము లభించును. మానవుని ప్రేమించునది యసహ్యించుకొనునది ప్రేమయెగదా! ప్రేమపూరిత హృదయుడెప్పుడును, అన్యాయ-అసాధుకార్యము లొనర్పడు."

"సత్యాన్వేషి యగువాడు సామాన్యవ్యసనములతోడ సంబంధములేదు. సత్యము-న్యాయమే వారి యాదర్శము. అదియేవారికి ఫసందు."

"ఉన్నతపదవుల గూర్చి యెప్పుడును చింతింపకుము. కాని వాని కొఱ కెప్పుడును సంసిద్ధుడ వైయుండును. సుయోగము ప్రాప్తించునప్పుడవి లభించును. జీవితమం దసరిచితము- అజ్ఞాతవిషయము లున్నవని దు:ఖింపకుము, జీవితమూల్యమునువృద్ధిపఱచుకొనుటకు బ్రయత్నింపుము."