పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే-గీ|| పూల విల్లెక్కుపట్టి పూ - బోడి గూడి
         భవుని నెలవునకుంజిత్త - భవుడురాగ
         ద్వంద్వమ్లు కాష్ఠగతినొంది - తమకమునను
         భావమ్లను గ్రియలచేతల్ల్ - బయలు నఱచె 35
తే-గీ|| ఒక్క పూవోరలోదెనె - నువిదకిచ్చి
         మిగత దాద్రావె గండు తు -మ్మెద యొకండు
         స్పర్శసుఖమున ఱెప్పలు - వ్రాల్చు మృగిని
         కృష్ణసారము గొకెను - శృంగమునను. 36
తే-గీ|| ప్రేమచే గరేణువు పద్మ - రేణు గంధ
         మైన పుక్కిటి జలమును - దాని కొసగె
         సగము నమలిన బిసమును - జాయ కిచ్చి
         గార వించెను మిగుల జ -క్కవయొకండు 37
తే-గీ|| శ్రమ కణంబుల నించుక - జాఱి నట్టి
         సత్త్రరేఖల బుష్పాస - నమున నుడియు
         కనుల శోబ్నిలి పాడేడు - కాంతమోము
         చుంబనము గొనె గింపురు - షుం డొకండు. 38
తే-గీ|| నిండు పుష్ప గుచ్చములు పా - లిండులుగను
         నెలయు చివుళు లందములైన - పెదవులుగను
         గలిగి సాంపొందు తీగలో - టులను జెట్లు
         ప్రేమ శాఖాబుజముల బ -రిష్వజించె. 39
తే-గీ|| అట్టివేళ నచ్చరల గే - యముల వినియు
         భర్గు డాత్మాను సంధాన - పరుండ యయ్యె
         హృదయ నిగ్రహులకు విస్సు - బృందము దమ
         సంయ మంబును భంగిప - జాలవెన్న 40
తే-గీ|| తీగ యింటె గడప నంది - తివిరి నిలిచి
         ఎడమచేత బఆంగరుబెత్త - మొసగబట్టి
         తర్జనిని నోరుమూయుచు - దర్జనముల
         నల్లరింజేయ కుండ దా - నడచుచుండే. 41
తే-గీ|| కదల కుండెను జెట్లు, తు - మ్మెదలు తిరుగ
         వండజములు కూయవు; మృగ - తండమ్లును