పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

          నళుల సక్తిని మదను, నా - మాక్షరములు
          గాగనుంచె వసంతుడు - కమ్రఫణితి. 27
తే.గీ|| కర్ణికారంబు నన్నెచే - గడిమి నొంది
        తావిలేమిని మదికి జీ -దఱయె గూర్చు
        నరయ దఱచుగ సకల గు -ణాస్పదముగ
        నొక్కవస్తువు సృజియింప - నొల్లడజుడు. 28
తే.గీ|| నిరియమిని లేత చందురు - కరణి వక్ర
        ములును మిక్కిలి యెఱుపులై - యలరుమోదు
        గలు నపంతు జెరిన సన - స్థలులు కపుడు
        గలుగుగోటి నొక్కుల బోలె - వెలయుచుండె 2
తే.గీ|| అళుల యంటను కాటుక - నలన జిత్ర
        మైన తిలకంబు మొగమున - గాన మాని
        చిగురు మోవి లేతయరుణు - చెలువురక్తి
        నలరగై సేసికొనె నప్పు - డామనిసిరి. 3
తే.గీ|| ప్రేంకణపు బూదుమరముల్ - మృగవిలోచ
        నములరాలగ గనులుగా - నక మదమున
        బైరకెదురుగ నవి మర్మ - రారసములం
        బండు టాకులు రాలున - న్వనులదిరిగె. 31
తే.గీ|| గండు గోయిలల్ మావిమొ - క్కలను మెక్కి
        వగరు గల్గు కంఠబుల - బలుకసాగె
        ననియు మాననీమానము - లనియజేయు
        మన్మధుని అల్కులై యొప్పె - మాధసమున 32
తే.గీ|| ఇనము దొలగుటచే నొవ్వి - యెడలినట్టి
        మోపు లాపాండురంబులౌ - మోములుగల
       కింపురుష వనితలకు జ - నింప గొడగె
       వివిధసత్త్ర రేఖలయందు - స్వేద జలము 33
తే.గీ|| ఇటు, అదాటున మధుని వి - జృంభణమున
        స్థాణునాశ్రమ వాసు లౌ - తానసులకు
        జిత్తములు వికృతిం బొందు - జిట్టచివర
        కెట్టులో యాసికొని రొక్క - పట్టుదలను 34